రవితేజ కథానాయకుడిగా గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. క్రాక్ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా శ్రీలీల పేరు వినిపించింది. తాజాగా రష్మిక మందన్న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. రవితేజ, రష్మిక కలిసి నటించడం ఇదే ప్రథమం. ఇద్దరి ఎనర్జీ లెవల్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదువుండదు. క్రాక్ మాదిరిగానే వాస్తవ సంఘనల ఆధారంగా ఈ కథను తయారు చేశారట మలినేని. సాయిమాధవ్ బుర్రానే ఈ సినిమాకి కూడా సంభాషణలు అందిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి మొదలుకానున్నట్టు తెలిసింది.
