ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా)గా పండుగాయల రత్నాకర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఎంపిక చేశారు. 2 ఏళ్ల పదవీ కాలంలో ముగియడంతో పదవీకాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో బాధ్యతలను చేపట్టిన రత్నాకర్ ఇప్పుడు మరో 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 2015లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన రత్నకర్ పార్టీకి విశేష సేవలు అందించారు. ముఖ్యమంత్రి జగన్, పార్టీలోని కీలక నేతలతోనే కాదు సాధారణ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో రత్నాకర్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. రెండోసారి ఈ పదవి రావడం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తనను మరోసారి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా తన శక్తికి మించి కష్టపడతానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలన దేశానికే ఆదర్శమని అన్నారు. విద్య`వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు.