Namaste NRI

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రవితేజ ఖిలాడీ

రవితేజ, రమేష్‌ వర్మ కలయికలో రాబోతున్న యాక్షన్‌ చిత్రం ఖిలాడి. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డిరపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో పాటు ఒక పాటని విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్టేడ్‌ వచ్చింది. తాజా చిత్రీకరణతో రెండు పాటలు మినహా టాకీ పార్ట్‌ మొత్తం పూర్తయిందని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌, ఏ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్‌ అంటూ ట్యాగ్‌ లైన్‌తో రాబోతున్న ఈ చిత్రం మవీష్‌ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. శ్రీకాంత్‌ విస్సా, దేవీశ్రీ ప్రసాద్‌ సోదరుడు సాగర్‌ ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events