Namaste NRI

రవితేజ మాస్‌జాతర .. వచ్చేది ఆరోజే

మాస్‌ జాతర రిలీజ్‌కి సంబంధించి రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు దసరా సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వింటేజ్‌ వైబ్స్‌, పక్కా కమర్షియల్‌ అంశాలతో ఈ చిత్రం థియేటర్లలో అసలుసిసలైన మాస్‌ పండుగను తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి కంటెంట్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, వినోదాల విందుకి హామీ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్‌ ఆదిలపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 

ఈ చిత్రంలో పోలీస్‌ఆఫీసర్‌ లక్ష్మణ్‌ భేరీ పాత్రలో కనిపించనున్నారు రవితేజ. ఆయన శైలి వినోదం, వింటేజ్‌ వైబ్‌ని జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, ఆద్యంతం హాస్యంతో ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, దర్శకత్వం: భాను భోగవరపు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events