
అమెరికాతో చర్చలకు సిద్ధమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా పేరుతో ట్రంప్ కరేబియన్ సముద్ర తీరంలో దాడులు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్‌తో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు మదురో తెలిపారు. వెనిజులాలో ప్రభుత్వాన్ని మార్చాలని, దేశంలోని విస్తారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలని అమెరికా కోరుకుంటోందని మదురో స్పష్టం చేశారు. ఆగస్టులో కరేబియన్ సముద్రంలో భారీ సైనిక మోహరింపుతో ప్రారంభమైన దాడులు నెలల తరబడి కొనసాగించడానికి ఇదే కారణమయని ఆయన పేర్కొన్నారు. వారు ఏమి కోరుకుంటున్నారు? బెదిరింపులు, భయపెట్టడం, బలవంతం ద్వారా తమను తాము రుజువు చేసుకోవాలని వారు కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది అని మదురో అన్నారు. రెండు దేశాలు డేటా ఆధారంగా చర్చించడానికి ఇదే సరైన సమయమన్నారు.















