పాలస్తీనాలోని గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆకలితో ఎదురుచూస్తున్న గాజాలోని అమాయక ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జార విడుస్తామని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమన్నారు. గాజా లోని అమాయక ప్రజలకు సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉంద ని వెల్లడించారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఆహార ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా గాజాలో ఎయిడ్ డ్రాప్ చేయనున్నట్లు బైడెన్ తెలిపారు.