Namaste NRI

తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు .. అంతరిక్షంలో

తెలంగాణ మూలాలున్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి రాజాచారి అరుదైన ఘనత సాధించారు. స్పేస్‌వాక్‌ (అంతరిక్షంలో నడక) చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి ఫ్లైట్‌ ఇంజినీర్‌ కైలా బారన్‌తో కలిసి బయటకు వచ్చిన ఆయన దాదాపు ఆరున్నర గంటల సేపు రోదసిలోని శూన్యంలో సంచరించారు. వీరిద్దరు క్వెస్ట్‌ నుంచి స్టార్‌బోర్డ్‌ `4 ట్రస్‌ వద్దకు చేరుకొని అక్కడ ఇప్పటికే ఉన్న సోలార్‌ ప్యానెళ్ల స్థానంలో కొత్తవాటిని అమర్చారు.  ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ క్రూ`3 మిషన్‌కు 2020లో కమాండర్‌గా ఎంపికైనా రాజాచారి గత ఏడాది నవంబర్‌లో ఐఎన్‌ఎస్‌కు వెళ్లారు. మంగళవారం నిర్వహించిన స్పేస్‌వాక్‌ కోసం వారం రోజులుగా అక్కడే సిద్ధమయ్యారు. అన్నిరకాల పరీక్షలు, భూమి మీద ఉన్న నిపుణులతో చర్చల అనంతరం నాసా స్పేస్‌వాక్‌కు అనుమతినిచ్చింది. మార్చి 23న నాసా మరోసారి స్పేస్‌ వాక్‌ నిర్వహించనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events