ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ అయింది. ఐనంపూడి కనకం బాబు నేతృత్వంలోని ఎన్నికల కమిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 31 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 23న అభ్యర్థుల నామినేషన్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. అనంతరం మార్చి 5వ తేదీన పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. యూఎస్‌పీఎస్ ఫస్ట్ క్లాస్ బ్యాలెట్ మెయిలింగ్ మార్చి 23వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 21 వరకు బ్యాలెట్ పత్రాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 22 ఓట్ల లెక్కింపు, ఏప్రిల్ 23న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుందని ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.














