జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఆర్‌ఆర్‌ఆర్ సెలబ్రేషన్ యాంథమ్ అంటూ ఎత్తర జెండా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడి గిత్తల్లాంటి అమర వీరుల్ని తలచుకుంటూ అంటూ జక్కన్న చెప్పే డైగాగ్‌తో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు యం.యం. కీరవాణి స్వరకర్త. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను యం.యం.కీరవాణి, విశాల్ మిక్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి హారికా నారాయణ్ ఆలిపించారు. స్వాతంత్య్ర సమరయోధులు కనిపిస్తుండగా వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్ కలిసి సందడి చేసిన తీరు ప్రధాన ఆకర్షణగా నిలించింది,














