అమెరికా ప్రతినిధుల సభలో నాలుగేళ్ల విరామం తర్వాత రిపబ్లికన్లు మెజార్టీ సాధించారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు మిగిలిన రెండేళ్ల పాలనలో దిగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో రిపబ్లికన్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. హోరా హోరీగా సాగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు దాదాపు పూర్తి స్థాయిలో వెలువడ్డాయి. 435 మంది సభ్యులున్న సభలో మెజార్టీకి అవసరమైన 218 స్థానాలను రిపబ్లికను గెలుచుకున్నారు. డెమోక్రట్ల బలం 211 స్థానాలకు చేరుకుంది. మిగిలిన ఆరు స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటి ఫలితాలన్ని బట్టి సభలో తుది బలాబలాటేమిటనేది నిర్ణయమవుతుంది. స్పీకర్‌గా ఇప్పటి వరకు నాన్నీ పెలోసీ (డెమోక్రటిక్ పార్టీ) ఉండగా ఆమె స్థానంలో కెవిన్ మూకార్తీ (రిపబ్లికన్)ని శాసనకర్తలు ఎన్నుకున్నారు.
ప్రతినిధుల సభలో మెజార్టీ కోల్పోవడంతో జో బైడెన్ బలహీనంగా మారిపోయారు. ప్రతి ప్రధాన నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్ పార్టీ ప్రతినిధులపై ఆధారపడాల్సి వస్తుంది. లోయర్ హౌస్‌లో ఆధిపత్యం ఉన్న పార్టీ మాత్రమే పార్లమెంట్‌లో చట్టాలు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇదే సమయంలో బైడెన్ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.