కల్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం బింబిసార. ఏ ట్రైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టూ గుడ్ ఉపశీర్షిక. వశిష్ట్ దర్శకుడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. బుధవారం (జున్ 27) ట్రైలర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. హద్దులను చేరిపేస్తే మన రాజ్యపు సరిహద్దులను ఆపే రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణబిక్ష ఎదిరిస్తే మరణం అంటూ బింబిసారుడిలా పీరియాడిక్ గెటప్‌లో కనిపించిన నందమూరి కళ్యాణ్ రామ్ పరర్ ఫుల్ నటనతో మెప్పించారు. ఆ వెంటనే నీ కలల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడు వస్తున్నాడు చూడు అనగానే స్టైలిష్‌గా కనిపిస్తూ విలన్స్ భరతం పడుతూ మరో కోణంలో అలరించారు. నాడైనా నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడు కత్తిని దాటాలంటూ కళ్యాణ్‌రామ్ చెప్పిన డైలాగ్ వింటుంటే గుజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఈ నెల 29న ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. దీనికి ఎన్టీఆర్ అతిథిగా హాజరవుతారు అని చిత్రబృందం తెలిపింది. ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి చిరంతన్‌భట్ సంగీతాన్నందిస్తున్నారు.














