ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే గత వారం నుంచి ఇప్పటి వరకు సుమారు 11,500 విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. యూరోప్, అమెరికాలో కోవిడ్ కేసులు మరీ ఎక్కువగా పెరిగాయి. 11,500 విమానాలను రద్దు చేయడమే కాకుండా, వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభణ వల్ల సిబ్బంది హాజరుకావడం లేదని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు అధికమయ్యాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)