బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కు క్రికెట్ అంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో క్రికెట్‌పై తనకున్న ప్రేమను ఆయన వ్యక్తపరిచారు. పలు సందర్భాల్లో క్రికెట్ ఆడిన వీడియో లను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మరోసారి ఆయన క్రికెట్ ఆడారు. ఇంగ్లండ్ ఆటగాళ్ల తో సరదాగా బ్యాట్ పట్టారు. సునాక్ లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌ను సంద ర్శించారు. అక్కడ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో సమావేశమయ్యారు. అనంతరం ఆటగాళ్లతో కలిసి నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ జేమ్స్ ఆండర్సమ్ సహా ఇతర ఆటగాళ్లతో కలిసి ఉత్సాహంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు.