బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు వింత అనుభవం ఎదురైంది. రిషి సునాక్ సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దానికి ఆమె ‘బాగానే చూసుకుంటున్నారు. అయితే, ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తోంది. వాటిని చూస్తుంటే జాలేస్తోంది’ అని బదులిస్తుంది. నర్సుల వేతనాలు పెంచాలని కోరి ంది. దీనికి రిషి.. ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ బదులిస్తారు. అంతలోనే ఆమె కల్పించుకొని ‘ప్రయత్నించడం కాదు.. తీవ్రంగా ప్రయత్నించాలి. రోగి మాటలకు ఆశ్చర్యపోయిన రిషి సునాక్.. ఓకే తప్పకుండా అని బదులిస్తారు.
