Namaste NRI

అమెరికాలో రోడ్డు ప్రమాదం…నల్లగొండ వాసి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా వాసి మృతి చెందారు.  జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతి కిరణ్‌ (24) దుర్మరణం చెందాడు.  శ్రీనివాస్‌రెడ్డి`అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు చంద్రకాంత్‌ రెడ్డి, క్రాంతి కిరణ్‌ రెడ్డి ఉన్నారు. ఇద్దరు ఎమ్మెస్‌ చదివేందుకు వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కాంత్రి కిరణ్‌ రెడ్డి వీకెండ్‌ సందర్భంగా మిత్రులతో కలిసి బయటకు వెళ్లాడు. నలుగురు మిత్రులతో కలిసి కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కాంత్రికిరణ్‌ మృతి చెందగా, అతని ముగ్గురు స్నేహితులు కోమాలోకి వెళ్లారు. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించి అమెరికా నుంచి సమాచారం అందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదయఛాయలు అలుముకున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events