అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి దర్శకుడు. జీఏటూ పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. యూత్‌తో పాటు అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అల్లు శిరీష్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు, సంభాషణలు నేటి యువతరానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అన్నారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, సహ నిర్మాత : విజయ్ ఎం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, కెమెరా: తన్వీర్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)