Namaste NRI

దర్శకుడు మారుతి చేతుల మీదుగా రొరి ఫస్ట్‌ లుక్‌ విడుదల

చరణ్‌ రొరి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం రొరి. కరిష్మా కథానాయిక. చరణ్‌ రొరి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని ప్రముఖ దర్శకుడు మారుతి  విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ పొలిటికల్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. అనుకోని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ వెళ్లిన యువకుడు, అక్కడ హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది చిత్ర కథ. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా వుంటుంది అన్నారు. దర్శకుడు మారుతి చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది అన్నారు. కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌, దేవి ప్రసాద్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : భీమ్స్‌ సెసిరొలియో, కెమెరా దాశరధి శివేంద్ర. కూర్పు : కార్తీక్‌ శ్రీనివాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events