Namaste NRI

రోజ్ గార్డెన్ టీజర్ విడుదల

నితిన్‌ నాష్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా రోజ్‌ గార్డెన్‌. ఉగ్రవాదం నేపథ్యంలో మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నిర్మాత ఏ.ఎం. రత్నం విడుదల చేశారు. ఉగ్రవాదం నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. ఒక పాటను ఏ.ఎం రత్నం రాశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుతో పాటు తమిళ హిందీభాషల్లో విడుదల చేస్తాం అని తెలిపారు.  తమిళ నటుడు, నిర్మాత త్యాగరాజన్‌ ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్రని పోషించారు. పాటలన్నిటినీ ముంబయిలో రికార్డ్‌ చేశాం. చిత్రం అందరికీ అలరించేలా ఉంటుందని తెలిపారు.  పోసాని, గౌతంరాజు, ధనరాజ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్న కుమార్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. ఈ చిత్రానికి చదలవాడ శ్రీనివాసరావు, చదలవాడ తిరుపతిరావు నిర్మించారు. ఈ చిత్రానికి జి.రవికుమార్‌ దర్శకత్వం వహించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events