దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం లో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం రౌడీ బాయ్స్. శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌పుల్ ఎంటర్ టైనర్ ఇది. యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించాము. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డ్యాన్సులు, పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి అని అన్నారు. ప్రతి ఒక్కరికి తమ కాలేజీ జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది. మా కుటుంబం నుంచి ఆశిష్ హీరోగా పరిచయమవుతుండటం ఆనందంగా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, మది సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు.














