
ఇరాన్‌తో నెలకొన్న వివాదానికి దౌత్య పరిష్కారం సాధించాలన్నదే తమ అభిమతమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. అవకాశం లభిస్తే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యేందుకు తమ అధ్యక్షుడు ట్రంప్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం నేరుగా చర్చించడం ఒక ఆచరణాత్మక మార్గంగా ట్రంప్ భావిస్తున్నారని అన్నారు. ప్రత్యర్థులతో సమావేశం కావడాన్ని వారి అభిప్రాయాల తో ఏకీభవించడంగా అర్థం చేసుకోకూడదని చెప్పారు. నేను ఎవరితో అయినా కలవడానికి ఇష్టపడే అధ్యక్షుడి కింద పనిచేస్తున్నాను అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ను కలవాలని అనుకుంటున్నానని ఖమేనీ చెబితే ఆ సమావేశం జరుగుతుందని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు.















