Namaste NRI

ఒహాయో డేటన్ హిందూ దేవాలయంలో రుద్ర, చండీ హోమాలు

ఒహాయో బీవర్‌క్రీక్‌ హిందూ దేవాలయంలో సెప్టెంబర్‌ 17 నుండి 19 వరకు ప్రపంచ శక్తి దినోత్సవం పురస్కరించుకుని లోకక్షేమం కోసం మహా రుద్రం, శత చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. జీఆర్‌డీ అయ్యర్‌ గురుకూల్‌ వ్యవస్థాపకులు రమేష్‌ నటరాజన్‌, గాయత్రి నటరాజన్‌ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కన్నుల విందుగా, శ్రవణానందంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమాలు, పూజలు చేయటం విశేషం.  గతంలో సహస్ర సువాసిని పూజ, శత చండీ హోమం, ఆన్‌లైన్‌ ద్విసహస్ర చండీపారాయణం గురుకూల్‌ నిర్వహించినట్లు ఈ సంవత్సరం డేటన్‌ దేవాలయం వారి సమన్వయంతో ఒక పండుగగా చేసుకోవడం చాలా సంతోషమైన విషయం.  గాయత్రి నటరాజ్‌ యావత్‌ జగత్తుకి బిందువైన దేవిని శక్తి రూపంలో పూజించడం ఈ ప్రపంచ శక్తిదినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

                గురుకూల్‌ సభ్యులందరి తరపున డేటన్‌ హిందూ దేవాలయ నిర్వహణ వర్గం వారికీ, కార్యవర్గ సభ్యులకు, హాజరైన భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక ముందు కూడా గురుకూల్‌ ఇలాంటి కార్యక్రమాలు ఇతర దేశాలలో కూడా జరుపుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా జరుపుకోవడానికి సహకరించిన తన తోటి కార్యవర్గం వాలంటీర్లు, దాతలు, కళాకారులు, ఆలయ సిబ్బంది అండగా నిలిచిన భక్తులకు విశేష కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events