శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రుద్రవీణ. సాయివీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం యానాంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సరికొత్త కథ కథనాలతో మా రుద్రవీణ తెరకెక్కుతోంది. ప్రతిభ ఉన్న కొత్త నటీనటులతో పాటు మంచి సాంకేతిక నిపుణుల సపోర్ట్‌తో సినిమాను క్యాలిటీగా, అందరికీ నచ్చేలా తీస్తాం. మా సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా యానాంలోనే జరుగుతోంది అన్నారు. జి.మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడు రఘు కుంచె ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. చమ్మక్‌చంద్ర, చలాకీ చంటి, ధన్‌రాజ్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జీఎల్‌ఎన్ బాబు, సంగీతం: మహవీర్ యేలేందర్, ప్రత్యేక పర్యవేక్షణ : కె.త్రివిక్రమ రావు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)