
రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్‌ను అమెరికా సీజ్ చేయడంతో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో రష్యన్ నేత అలెక్సీ ఝురవ్లెవ్ అమెరికాను గట్టిగా హెచ్చరించారు. సముద్రాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అమెరికా కొనసాగిస్తే, ఆ దేశాన్ని సైనికపరంగా ఎదుర్కొనవలసి ఉంటుందని చెప్పారు. తనను దండించేవారు లేరనే భావనతో అమెరికా వ్యవహరిస్తున్నదన్నారు. దానిని దీటైన ప్రతీకార చర్యల ద్వారా నిలువరించాలని తెలిపారు. టార్పెడోలతో దాడి చేయాలి, అమెరికన్ తీర గస్తీ పడవలను ముంచేయాలి. సాధారణంగా అమెరికా తనకు వేలాది కిలోమీటర్ల దూరంలో గస్తీ కాస్తుంది అని చెప్పారు. వెనెజువెలాలో స్పెషల్ ఆపరేషన్ తర్వాత అమెరికా తనకు ఎదురులేదనే యూఫోరియాలో ఉందని, దానిని ముక్కు మీద కొడితేనే ఆపగలమని అన్నారు.















