ఉక్రెయిన్‌లో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. దేశంలోని ఐదు నగరాల్లో పౌరుల తరలింపునకు అనువుగా తాత్కాలికంగా కాల్పులను నిలిపివేస్తున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడిరచింది. రాజధాని కీవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మరియుపోల్ నగరాల్లో కాల్పులను విరమిస్తున్నట్లు ప్రకటించింది. అయితే మరియుపోల్‌లో రెండు సార్లు పౌరుల తరలింపునకు ఆటకం కలిగింది. కాల్పులను నిలిపివేస్తున్నట్టు రష్యా ప్రకటించినప్పటికీ అక్కడ దారులు జరపడంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. హ్యుమానిటేరియన్ కారిడార్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 14వ రోజుకు చేరాయి.














