Namaste NRI

రష్యా వార్నింగ్.. ఆంక్షలు ఎత్తివేయకుంటే

రష్యాపై పాశ్చాత్య దేశాలు  ఆంక్షలు ఇలాగే కొనసాగిస్తే, అప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూలిపోతుందని పేర్కొన్నది. రష్యాకు చెందిన అంతరిక్ష ఏజెన్సీ రాస్‌కాస్మోస్‌ అధిపతి ఈ వార్నింగ్‌ ఇచ్చారు. దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని రష్యా ఈ డిమాండ్‌ చేసింది. కఠినమైన ఆంక్షల వల్ల ఐఎస్‌ఎస్‌ కూలే ప్రమాదం ఉన్నట్టు రాస్‌ కాస్మోస్‌ తెలిపింది. రష్యాపై అమలవుతున్న ఆంక్షల్లో కొన్ని ఉక్రెయిన్‌పై యుద్దానికి ముందు నుంచి అమలవుతున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షల వల్ల ఐఎన్‌ఎస్‌కు సర్వీసింగ్‌ చేసే రష్యన్‌ రోదసీ నౌక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. ఈ కేంద్రంలోని రష్యన్‌ సెగ్మెంట్‌పై ప్రభావం పడుతుందన్నారు. కక్ష్యను సరిదిద్దడానికి ఈ రష్యన్‌ సెగ్మెంట్‌ దోహదపడుతుందన్నారు.  మరోవైపు కేవలం కీవ్‌ 25 కిలోమీటర్ల దూరానికి రష్యా బలగాలు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 60 కిలోమీటర్ల పొడుగైన రష్యా  సైనిక కాన్వాయ్‌ కీవ్‌ దిశగా కదులుతున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events