రాబోయే రోజుల్లో రష్యా దళాలు ఉక్రెయిన్‌పై కచ్చితంగా దాడులు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.వైట్‌హౌజ్‌లో జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల్లోనే రష్యా దళాలు దాడులు చేసే అవకాశముందని మరోమారు ప్రకటించారు. కొన్ని రోజుల్లోనే అతిపెద్ద ముప్పు పొంచి ఉందని, ఈ విషయం సమసిసోలేదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్నామని రష్యా ప్రకటించిన నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇక రష్యా అధ్యక్షుడుతో ఫోన్లో సంభాషణలు చేయమని తేల్చి చెప్పారు. అతి పెద్ద ముప్పే పొంచి వుంది. దళాలను రష్యా ఉపసంహరించుకోలేదు. పైగా మరిన్ని దళాలను మోహరిచింది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి దాడులకు దిగే అవకాశాలున్నాయని మాకు సమాచారం ఉంది అని అన్నారు.
అయితే రష్యా ప్రభుత్వం మాత్రం ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన ఏదీ తమకు లేదని అంటోంది. గత కొంత కాలంగా అమెరికా, దాని మిత్ర దేశాలు భయపడుతున్నట్లుగా ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన ఏదీ మాకు లేదు అని రష్యా విదేశాంగ శాఖ ఒక బహిరంగ ప్రకటనలో తెలిపింది.