రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ ఈ టర్మ్‌లో తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో చేయనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు.
చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ జీ జిన్‌పింగ్‌తో పుతిన్ సమావేశం కానున్నారు. ఇరు దేశాల నడుమ దౌత్య సంబంధాలపై వారు చర్చించనున్నారు. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.