రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారు అయింది. పుతిన్, ప్రధాని మోదీ ఈ నెల 6వ తేదీన జరగనున్న శిఖరాగ్ర భేటీలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలను సమీక్షిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు, కోవిడ్ మహమ్మారి తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న 21వ శిఖరాగ్ర భేటీకి 6న పుతిన్ భారత్‌కు వస్తున్నారు. 6వ తేదీ మధ్యాహ్నం మోదీ, పుతిన్ భేటీ, చర్చలు, వివిధ అంశాలపై ఒప్పందాల అనంతరం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)