ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిరిaయాలో 93 శాతం, ఖేర్సన్‌లో 87 శాతం, లుహాన్‌స్క్‌లో 98 శాతం, డొనెట్‌స్క్‌లో 99 శాతం మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు ప్రకటించారు. క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్‌లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్ తెలిపారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)