ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా అయిన వికీపీడియాను నిర్వహించే వికిమీడియా ఫౌండేషన్‌కు రష్యాలోని మాస్కో కోర్టు రూ.20 లక్షల జరిమానా విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సంబంధించి రష్యా భాషలో ఉన్న ఓ ఆర్టికల్‌లో తప్పుడు సమాచారం ఉన్నందున దానిని తొలగించాలని రష్యా ప్రభుత్వ సమాచార నిఘా సంస్థ వికీపీడియాను ఆదేశించింది. ఇందుకు నిరాకరించడంతో వికిమీడియా ఫౌండేషన్‌కు కోర్టు జరిమానా విధించింది.
గత వారం కూడా మాస్కో కోర్టు మరో ఆర్టికల్‌కు సంబంధించి వికీమీడియా ఫౌండేషన్‌కు రూ.8 లక్షల జరిమానా విధించింది. కాగా, వీకీపీడియాను సర్చ్ ఇంజిన్లలో రష్యా చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు లేబల్ చేయాలని, మరిన్ని ఆర్టికల్స్‌కు సంబంధించి కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రష్యా భావిస్తున్నది.