Namaste NRI

ఉక్రెయిన్‌ పై రష్యా విజయం అసాధ్యం: అమెరికా

ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరిచారు. ఈ సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో రష్యా విజయం అసాధ్యమన్నారు. నాటో కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న పుతిన్‌ ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రపంచం దశ, దిశను కొందరు నియంతలు నిర్ణయిస్తామంటే అనుమతించబోమన్నారు. ఉక్రెయిన్‌లో రష్యాపై తాము పోరాటం చేయబోమని అన్నారు. నాటో, రష్యా ముఖాముఖి తలపడితే మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందని హెచ్చరించారు. దాన్ని నివారించేందుకు కృషి చేస్తామన్నారు. సభ్యదేశాల భూభాగంలో ప్రతి అంగుళాన్ని కాపాడుకునే శక్తిసామర్థ్యాలు  నాటోకు ఉన్నాయన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events