Namaste NRI

ఆర్‌ ఎక్స్‌ ఫ్లోర్‌ మూవీస్‌ ప్రారంభం

టాలీవుడ్‌లో ఓ కొత్త నిర్మాణ సంస్థ రాబోతున్నది. ఆర్‌ ఎక్స్‌ ఫ్లోర్‌ మూవీస్‌ పేరుతో అతీకూర్‌ రెహమాన్‌ ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థపై ఇకనుంచి నిరవధికంగా సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయినట్టు నిర్మాత అతీకూర్‌ రెహమాన్‌ తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సినిమాలే తమ సంస్థ నుంచి వస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన బ్యానర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత అతీకూర్‌ రెహమాన్‌ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మహతి, డాక్టర్‌ సత్యవతి, అరుణ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events