కబాలి ఫేమ్ సాయి ధన్షిక ప్రధానపాత్రలో నటించిన చిత్రం దక్షిణ. ఓషో తులసి రామ్ దర్శకత్వం వహిస్తు న్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్‌పై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. రిషవ్ బసు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సనా విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే. తులసి రామ్ టాలీవుడ్‌కి మరో ట్రెండ్ సెట్టర్. దక్షిణ సినిమాతో సైకో థ్రిల్లర్‌ను ఇవ్వబోతున్నారు అంటూ అభినందించారు. త్వరలో విడుదల తేదీ ని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్రబృంద సభ్యులు కూడా పాల్గొన్నారు.