నవీన్చంద్ర, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. యశ్వంత్ ములుకుట్ల నిర్మాత. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను యువహీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ నిర్మాతలు యశ్వంత్, దామ నాకు మంచి స్నేహితులు. దర్శకుడు శ్రీకాంత్ తీసిన భానుమతి, రామకృష్ణ చూశాను. అందులో చాలా క్లిష్టమైన ఎమోషన్స్ వున్నాయి. మంత్ ఆఫ్ మధు లో కూడా అలాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. నవీన్ ని చూస్తే నాకు చాలా అనందంగా వుంటుంది. అన్ని రకాల పాత్రలు చేస్తుంటారు. ఇందులో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. స్వాతి నాకు చాలా మంచి స్నేహితురాలు. ఈ సినిమాతో తనకి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.ఈ సినిమాకు మంచి కథతో పాటు సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగా కుదిరాయని, ఓ జంట ప్రయాణానికి అద్దం పడుతూ హృదయాన్ని కదిలిస్తుందని హీరో నవీన్చంద్ర చెప్పారు. ఈ సినిమాలోని ఎమోషన్స్తో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని స్వాతి రెడ్డి చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.
