విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న సినిమా జీరుగా హుషారుగా. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను నటించాను. పక్కింటి కథలా అనిపిస్తుంది. బంధాలు, అనుబంధాలు, స్నేహం జీవన పోరాటం అంశాలను ప్రస్తావించారు అన్నారు. అనంతరం దర్శకుడు అనూ ప్రసాద్ మాట్లాడుతూ కొవిడ్ టైమ్‌లో కష్టాలకు ఓర్చి సినిమా పూర్తి చేశాం. మధ్యతరగతి కుటుంబ కథా చిత్రమిది. కథను నడిపే బరువంతా హీరోపైనే ఉంటుంది. పాటల రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. మధునందన్, రోహిణి, సోనూ ఠాగూర్, క్రేజీ ఖన్నా, సతీష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, పూర్ణాచారి మంచి సాహిత్యం అందిచారు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ సంస్థలో నిరీశ్ తిరువీధుల నిర్మిస్తున్నారు. అనూ ప్రసాద్ ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.