సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్ వేడుకలకు తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండగ జరుపుకొందాం అని సైమా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ వేడుకలను ఎప్పటిలాగా విదేశాల్లో కాకుండా ఈ సారి హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2012లో మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 8 సార్లు ఈ అవార్డులను అందజేశారు. 2019 ఆగస్టు 15, 16 తేదీల్లో ఖాతార్ లో జరిగింది.కరోనా కారణంగా గతేడాది సైమా అవార్డులను నిర్వహించలేదు.