చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ముంబయిలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం రంగంలోకి దిగారు సల్మాన్‌ఖాన్. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ భాయ్, సల్మాన్ ఖాన్‌కు స్వాగతం.. మీ రాక మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మీతో తెరను పంచుకోవడం సంతోషంగా ఉంది. మీరు సినిమాలో కనిపిస్తే చాలు ప్రేక్షకులకు కిక్ వస్తుంది అన్నారు. దానికి సంబంధించిన ఫొటోని చిరంజీవి ట్విటర్ ద్వారా పంచుకున్నారు. మలయాళంలో విజయవంతమైన లూసిఫర్‌కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకీయం నేపథ్యంలో సాగే కథ ఇది. నయనతార నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : నీరవ్ షా, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, సంగీతం : ఎస్ థమన్.














