Namaste NRI

నవ్వుల క్లాసిక్‌గా సామజవరగమన : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా  శ్రీవిష్ణు మాట్లాడుతూ సామజవరగమన కథ చెప్పినప్పుడు నువ్వు నాకు నచ్చావ్‌ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నేడు నిజమైంది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు అన్నారు.  సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. యూఎస్‌లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా నవ్వుల క్లాసిక్‌గా నిలిచిపోతుంది. ఇలాంటి గొప్ప విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు.

నిర్మాత రాజేష్‌ దండా  మాట్లాడుతూ  ఇది తనకు జీవితంలో మరిచిపోలేని సక్సెస్‌ అని, ఇలాంటి గొప్ప సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మించినందుకు సంతోషంగా వుందని తెలిపారు. మరో నిర్మాత అనిల్‌ సుంకర  మాట్లాడుతూ  ఇటీవల తనకు అపజయం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అందరూ సపోర్ట్‌ చేశారని, వారందరూ ఈసారి తనకు విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందుకే ఇలాంటి విజయం దక్కిందని చెప్పారు.  ఈ వేడుకలో దర్శకుడు రామ్‌ అబ్బరాజు, హీరోయిన్‌ రెబా మోనికా జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events