Namaste NRI

సముద్రుడు మూవీ టీజర్‌ విడుదల

రమాకాంత్‌, అవంతిక, భానుశ్రీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సముద్రుడు. ఈ చిత్రాన్ని కీర్తన ప్రొడక్షన్స్‌ పతాకంపై బాదావత్‌ కిషన్‌ నిర్మిస్తున్నారు. నగేశ్‌ నారదాసి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా టీజర్‌ను మాజీ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ టీజర్‌ను కేటీఆర్‌గారు విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఒక సోషియో ఎలిమెంట్‌ను కమర్షియల్‌గా మలిచి ఈ సినిమాను రూపొందించాం. మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. సీనియర్‌ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. మే 3న విడుదల చేస్తాం అన్నారు. ఈ సినిమాకు సుభాష్‌ ఆనంద్‌ సంగీతం సమకూర్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events