Namaste NRI

పూరి సినిమాలో సంయుక్త మీనన్‌ 

అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది ఎవరో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంయుక్త మీనన్‌  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం అంటూ సంయుక్తకు చిత్ర యూనిట్ వెల్‌కమ్ చెప్పింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి టబు, దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బెగ్గర్ లేదా బిక్షాందేహి అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

Social Share Spread Message

Latest News