టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న చిత్రం మైఖేల్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పీ రామ్‌మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ పాటను సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ పాడాడు. హీరో తన ప్రియురాలిపై ప్రేమతో పాడుకుంటున్న ఈ పాటను కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రాశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేశాడు.
ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. అనసూయ, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీ రోల్స్ పోషిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. మైఖేల్ తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.