
సంక్రాంతి-2026 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల్లో వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, పిల్లలకి డ్రాయింగ్ ఈవెంట్, క్రికెట్ పోటీలు, మహిళలకి ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కొసమెరుపుగా జనవరి 10న రోజంతా సాగిన శాస్త్రీయ మరియు సినీ నృత్యాలు, పాటలు మరియు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు,జపనీస్ వారికి చిరస్మరణీయ అనుభూతిని కలిగించాయి. ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా తదుపరి తరాలకు అందించే రీతిలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) నిరంతరం కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా కలిసి జరుపుకున్నారు.















