మంచు విష్ణు లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నప్పలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్ర వివరాలతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఖడ్గాలు చేతిలో పట్టుకొని పోరుకు రెడీ అంటున్న లుక్‌లో రౌద్రరూపం చూపిస్తున్నాడు శరత్‌కుమార్. శివుడి ఆరాధ్య భక్తుడు కన్నప్ప ఇతిహాస ప్రయాణాన్ని చూపించబోతున్నాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన చేతిలో ఖడ్గం పట్టుకొని సమరంలో ఉన్న మంచు విష్ణు కన్నప్ప పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్‌కుమార్ కన్నప్పలో శివుడిగా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.