Namaste NRI

సర్కార్ బాయి మూవీ ప్రారంభం

శ్రీరామ్‌ నిమ్మల, సాయి కీర్తన హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సర్కార్‌ బాయి. లారా దర్శకత్వం. ఈ చిత్ర పూజా కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ గణేష్‌ టెంపుల్‌లో ఘనంగా నిర్వహించారు. ముహూర్త కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్‌ రాంరెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, దర్శకుడు లారా సీన్‌ డైరెక్షన్‌ చేశారు. ముహూర్తం షాట్‌ను తెలంగాణ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారి దాస్య నాయక్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు లారా మాట్లాడుతూ 1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అం శాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకం. ప్రేక్షకులు మా సామాజిక కథాంశంతో రాబోయే చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

తెలంగాణ సంస్కుర్తి భాగంగా వచ్చే సినిమాలను ఆదరించాలని దర్శకులు ప్రేమ్‌ రాజ్‌ కోరారు. బాహుబలి ప్రభాకర్‌, నాగ మహేష్‌, దిల్‌ రమేష్‌, చలాకీ చంటి, చిట్టిబాబు, శివాని రెడ్డి, నుపూర్‌ ముఖర్జీ, అతిధి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి నిర్మాత : తుమ్మల ప్రఫుల్‌రాం రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌: కె.శివ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events