సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతున్నది. ఇన్నాళ్లూ సంప్రదా య నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్ యూనివర్స్ ప్రదర్శనలో భాగస్వామి కానుంది. 27 ఏండ్ల రుమీ అల్ఖహ్తానీ ఆ దేశ ప్రతినిధిగా ఈ ప్రదర్శనలో తొలిసారిగా పాల్గొననున్నారు. రియాద్‌కు చెందిన రుమీకి గతంలో పలు ప్రపంచ ప్రదర్శనల్లో పాల్గొన్న అనుభ వం ఉంది. ఇటీవల మలేసియాలో జరిగిన మిసెస్ గ్లోబల్ ఆసియాన్‌లో ఆమె పాల్గొంది. మోడల్ రూమీ అల్కహ్ తానీ అంతర్జాతీయ అందాల పోటీలో తమ దేశం తరఫున తొలి అభ్యర్థిని కాబోతున్నానని వెల్లడించింది.