కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ఏడాదిన్నరకు పైగా అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలను ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు విదేశీ ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. విదేశీ ప్రయాణికులపై కరోనా ఆంక్షలను త్వరలోనే తొలగించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ జాబితాలో భారత్ సహా మరో ఆరు దేశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌదీ వెళ్లే విదేశీయులు మరో దేశంలో కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందే. అప్పుడే సౌదీలోకి వారిని అనుమతిస్తున్నారు.
డిసెంబర్ 1వ తేదీ నుంచి భారత్, పాకిస్థాన్, బ్రెజిల్, వియత్నం, ఈజిప్ట్, ఇండోనేషియా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నేరుగా తమ దేశంలోకి అనుమతిస్తామని సౌదీ వెల్లడిరచింది. అయితే ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా కూడా ఐదు రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు కూడా ఈ కార్వంటైన్లో ఉండాల్సిందేనని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది కరోనా కారణంగా విదేశీ ప్రయాణికులపై సౌదీ అరేబియా ట్రావల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే సౌదీ వెళ్లిన తర్వాత అక్కడి ఆరోగ్యశాఖ సూచన మేరకు కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అంతర్గత మంత్రితశ్వ శాఖ వెల్లడిరచింది.