సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలకు డ్రైవింగ్, ఆర్మీలో చేరడం, మగతోడు లేకుండా ఒంటరిగా ప్రయాణాలతో పాటు ఇటీవల సౌదీ రైల్వే పాలిటెక్నిక్ (ఎస్‌ఆర్‌పీ) ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలను ట్రైన్స్ నడిపేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇకపై సౌదీ మహిళలు ట్యాక్సీలు కూడా నడపొచ్చు. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కీలక ప్రకటన చేసింది. మహిళలు జనరల్ ట్యాక్సీ లైసెన్స్ కోసం దేశంలోని రియాద్, జెడ్డా, జజాన్, అసిర్, నజ్రాన్, జెఫ్, హైల్, తెఫ్ నగరాల్లోని 18 డ్రైవింగ్ స్కూల్స్‌లో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. లైసెన్స్ దరఖాస్తు రుసుమును 200 సౌదీ రియాళ్లుగా (రూ.3,959) నిర్ణయించినట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడిరచింది. 2018లో మొదటిసారి మహిళలకు డ్రైవింగ్ చేసే వీలు కల్పిస్తూ సౌదీ సంచలన నిర్ణయం తీసుకుంది.














