అరబ్ దేశం సౌదీ అరేబియా ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది. యాత్రికులకు ఇ-వీసా ల జారీని ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉమ్రా యాత్ర కోసం వచ్చే విదేశీయుల కోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సౌకర్యం వల్ల మరింత మంది ముస్లిం భక్తులు ఉమ్రా నిర్వహించుకోవడానికి వీలు పడుతుందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక ఇ-వీసాల దరఖాస్తుల కోసం నూసక్ ప్లాట్‌ఫారమ్ (Nusuk platform)- https://www.nusuk.sa/ar/about ను సంప్రదించాలని కోరింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా మరియు మదీనాలను సందర్శించడానికి సేవలను అందిస్తుందని తెలిపింది. అలాగే గృహ, రవాణా మరియు సమాచార సేవలను బహుళ భాషలలో పొందవచ్చని తెలియజేసింది.


