విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంలో సౌదీ అరేబియా ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. ఇకపై విదేశీ ట్రక్ డ్రైవర్లు సౌదీలో ప్రవేశానికి ఎంట్రీ వీసా తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఒమన్ రాజధాని మస్కట్‌లోని సౌదీ ఎంబసీ ద్వారా ఈ వీసా పొందాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఒమన్ చాంపర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీకి (ఓసీసీఐ) ట్రక్ డ్రైవర్లకు ఎంటీ వీసా ఇచ్చేది. ఇప్పుడు ఓసీసీఐ బదులుగా సుల్తానేట్‌లోని సౌదీ ఎంబీసీలో వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ట్రక్స్ ద్వారా సరుకు రవాణా చేసే వ్యాపారస్థులు తమ డ్రైవర్లకు ఎంట్రీ వీసా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అది చివరి గమ్యస్థానమైనా, తాత్కాలిక ట్రాన్సిట్ అయినా కూడా ఎంట్రీ వీసా పొందడం తప్పనిసరి అని పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)