వలసదారులకు ఇచ్చే వివిధ వీసాల రెన్యువల్ విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల రెన్యువల్‌కు ప్రవాసుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని ప్రకటించింంది. రెసిడెన్సీ, ఎగ్జిట్, రీఎంట్రీ, విజట్ వీసాలను వలసదారులు పూర్తి ఉచితంగా రెన్యువల్ చేసుకోవచ్చని సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ (జవాజత్) వెల్లడిరచింది. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్, పాకిస్థాన్ సహా 17 దేశాల ప్రవాసులకు లబ్ధి చేకూరనుంది. ఇండోనేషియా, పాకిస్థాన్, ఇండియా, టర్కీ, లెబనాన్, ఈజిప్ట్, బ్రెజిల్, ఈథోపియా, వియత్నాం, ఆఫ్గనిస్థాన్, దక్షిణ ఆఫ్రికా, జాంబియా, నమీబియా, మొజాంబిక్, బోట్స్వానా, లెసోతో, ఈశ్వతిని ఈ జాబితాలో ఉన్నాయి. 2022, జనవరి 31 వరకు జవాజత్ ఇలా ప్రవాసులకు వీసాలు ఆటోమెటిక్‌గా రెన్యువల్ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడిరచారు. దీనికి వలసదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.